ఇప్పటికే వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ వాసులందరికీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాలలో పిడుగుపాటుతో కురుస్తున్న వర్షాలు కూడా ప్రజలందరినీ మరింత భయాందోళనలో ముంచెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు మరో సారి విపత్తు నిర్వహణ అధికారులు ఏపీ వాసులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజులపాటు ఏపీ వాసులందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ.. ఇటీవలే విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల తో భారీ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం మొత్తం అలజడిగా ఉంటుంది అంటూ తెలిపిన విపత్తు నిర్వహణ శాఖ… 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో సముద్రతీరంలో గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదు అంటూ హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని… అధికారులు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేసేందుకు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సూచించింది.