అక్కా అని పిలిచి అత్యాచారం చేశాడట ఓ దుర్మార్గుడు. పూణె రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు దత్తాత్రాయ్ గడేను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. పోలీసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అక్కా అంటూనే బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.
ఆమె తన ఊరికి వెళ్లే బస్సు గురించి ఆరా తీయగా… దగ్గర్లోనే బస్ డిపో వద్ద పార్కు చేసిన బస్సులోకి ఎక్కించాడు. అనంతరం డోర్ లాక్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.
తాజాగా… కండోమ్స్ అంశం తెరపైకి వచ్చింది. నిందితుడు రాందాస్… యువతిపై లైంగిక దాడి చేసిన బస్సులో… వందల సంఖ్యలో కండోమ్ లు… మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.