రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు వరకు…తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి ఏంటి? అంటే చావు బతుకుల మధ్య ఉందని చెప్పొచ్చు. అసలు కాంగ్రెస్ పని ఇక అయిపోయిందనే స్థితి. కానీ రేవంత్ పిసిసి అయ్యాక ఒక్కసారిగా పరిస్తితి మారింది…కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాటాలు చేయడం…భారీ బహిరంగ సభలు పెట్టడం…రేవంత్ కోసం జనం విపరీతంగా రావడంతో, కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది. టీఆర్ఎస్కు ధీటుగా కాంగ్రెస్ వచ్చేసింది. ఈ పరిస్తితిలో బీజేపీ రేసులో కాస్త వెనక్కి వెళ్లింది.
అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రభావం కాంగ్రెస్‌పై ఎక్కువ ఉండదని రేవంత్ అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఉపఎన్నికని రేవంత్ మొదటనుంచి లైట్ తీసుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోవాలని అనుకున్నారు గానీ, కాంగ్రెస్ గెలవాలని అనుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్ కాస్త గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందని అనుకుని ఉంటారు. అందుకే రేవంత్ చాలావరకు లైట్ తీసుకున్నారు.
ఇక రేవంత్ చేసిందే కరెక్ట్ అయింది… హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్ 25 వేల ఓట్ల వరకు తెచ్చుకుని ఉంటే ఈటల ఓడిపోయేవారు..టీఆర్ఎస్ గెలిచేది. కానీ కాంగ్రెస్‌కు 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సరే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడింది. ఇక ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా ఇంకా దూకుడుగా పనిచేయొచ్చని రేవంత్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఊరుకోవడం లేదు. రేవంత్ ముందరి కాళ్ళకుబందం వేస్తున్నారు. హుజూరాబాద్‌లో దారుణంగా ఓడిపోవడానికి కారణం రేవంత్ అని ఆరోపిస్తున్నారు. అలాగే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అటు అధిష్టానం కూడా రేవంత్‌పై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
అయిపోయిందేదో అయిపోయిందని అనుకోకుండా ఓటమి కారణాలు చెప్పాలంటూ అధిష్టానం అడుగుతుంది. దీని వల్ల పావలా ఉపయోగం ఉండదు. అది వదిలేసి ముందుకెళితే పార్టీకి ప్రయోజనం అలా కాకుండా హుజూరాబాద్ ఉపఎన్నిక దగ్గరే ఆగిపోతే అంతా రివర్స్ అవుతుంది. అనవసరంగా దూకుడుగా ఉన్న రేవంత్‌ని వెనక్కి లాగినట్లే ఉంటుంది.