ప‌రిషత్ ఎన్నిక‌ల ర‌ద్దు.. వైసీపీకే పెద్ద దెబ్బ‌.. సంబురాల్లో ప్ర‌తిప‌క్షాలు

-

ఏపీలో పరిష‌త్ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల కంటే అధికార వైసీపీకే ఎక్కువ మేలు జ‌రిగే అవ‌కాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నిక‌లు ర‌ద్దు చేయ‌డంతో ఆ పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లింది. 515జ‌డ్పీటీసీ 7220ఎంపీటీసీ ఎన్నిక‌లకు ఏప్రిల్ 8న ఎన్నిక‌లు జ‌రిగాయి. అదే నెల 10కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కౌంటింగ్‌పై హైకోర్టు స్టే విధించింది.

అయితే శుక్ర‌వారం దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సంచ‌ల‌న తీర్పును చెప్పింది. సుప్పీంకోర్టు ఇచ్చిన మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌ను ఫాలో కాకుండా ఎన్నిక‌లు జ‌రిపార‌ని, కాబట్టి మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

అయితే వైసీపీకి దాదాపు 2వేల‌కు పైగా ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యారు. అలాగే 150కిపైగా జ‌డ్పీటీసీలు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌ల కోసం వైసీపీ అభ్య‌ర్థులు భారీగా ఖ‌ర్చు చేశారు. ఖ‌చ్చితంగా వైసీపీకే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలు కూడా చెప్పాయి. కానీ కోర్టు తీప్పుతో వైసీపీ అభ్య‌ర్థుల ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లంటే అంత మంది ఏక‌గ్రీవం అవుతారా? అస‌లు వారికే మ‌ళ్లీ టికెట్లు వ‌స్తాయా అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version