పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ .. కొత్త సేవలు ప్రారంభం..!

-

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. కేంద్రం పన్ను చెల్లింపుదారులకు కొత్త సర్వీసులని తీసుకు వస్తోంది. దీని వలన పన్ను చెల్లింపుదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కేంద్రం ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ ఫైలింగ్ వెబ్ పోర్టల్‌‌ను తీసుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ట్యాక్స్‌ పేయర్స్ ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. అదే విధంగా ఇతర ట్యాక్స్ సంబంధిత పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ని ఈజీగా పొందొచ్చు.

కొత్త ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌ అయితే వచ్చే నెల 7 నుంచి కూడా అందుబాటు లో ఉంటుంది. కొత్త సిస్టమ్‌కు బదిలీ అవుతుండటంతో పాత సిస్టమ్ పని చెయ్యదు అని కూడా తెలిపారు. జూన్ 1 నుంచి 6 వరకు ప్రస్తుత పోర్టల్ పని చెయ్యదు అని గమనించండి. www.incometaxindiaefiling.gov.in నుంచి www.incometaxgov.in కు బదిలీ అవుతున్నాయి ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR దాఖలు గడువును పొడిగించింది. దీనితో పన్ను చెలించే వాళ్ళకి కాస్త రిలీఫ్ కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version