తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌ళ్లీ అక్షింతలు..!

-

తెలంగాణలో కరోనా పరీక్షలు, రోగులకు అందుతున్న చికిత్స తీరుపై తాజాగా మరోసారి ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు చేయకుండా, జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? జూన్ 26న ఎంత మందికి పరీక్షలు చేశారు? ఆ రోజు హైదరాబాద్‌ లో టెస్ట్‌లు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర బృందం.. ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశానికి సంబంధించి ఈనెల 17న పూర్తి వివరాలు అందజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అంతేగాక డాక్టర్లు, పారమెడికల్‌ సిబ్బందికి ఏప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో తెలపాలని ఆదేశించింది. అసలు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు నిలదీసింది. అదేవిధంగా ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..10 నిమిషాల్లో రిపోర్టులు వచ్చే పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే… జూన్ 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version