ఏపీలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…

-

అధికార వైసీపీ పార్టీ కి భారీ ఊరట కలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం… ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును తోసిపుచ్చిన డివిజన్ బెంచ్… ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ చేసేందుకే మొగ్గు చూపింది.

ఇక.. ఈ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 8 వ తేదీన జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా నిన్న సిబిఐ కోర్ట్ మరియు హై కోర్టు లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు పిటిషన్ కు వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ ను కొట్టివేశారు. ఇక తాజాగా ఏపీ హైకోర్టు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version