Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

-

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని పెద్ద సినిమా లు రావ‌డం తో ధ‌రలు పెంచాల‌ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే దీని పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంత వ‌ర‌కు స్పందించ లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం లోని థియేట‌ర్ల యాజ‌మాన్యా లు హై కోర్టు ను ఆశ్ర‌యించాయి.

అయితే తెలంగాణ హై కోర్టు సినిమా టికెట్ల ధ‌ర ను పెంచ‌డానికి అనుమ‌తి ఇస్తు తీర్పు ను ఇచ్చింది. అయితే ఒక్కో టికెట్ పై రూ. 50 మాత్ర‌మే పెంచాల‌ని హై కోర్టు తీర్పు ను ఇచ్చింది. అయితే టికెట్ల ధరలు పెంచుకు నేందుకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న పుష్ప తో పాటు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమా ల‌కు ఒక టికెట్ పై రూ. 50 పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version