చిన్నపిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకోగలుగుతారు..అది మంచైనా, చెడైనా సరే..త్వరగా అది వారికి నచ్చేస్తుంది. దానివల్లే కొన్ని పేరెంట్స్ కి ఇష్టంలేని పనులు చేసి తన్నులు తింటుంటారు. కొంతమంది పిల్లలు ఎక్కవగా తల్లిదండ్రులు కొడుతుంటే వారికి తమ పేరెంట్స్ పై వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే..పిల్లలను కొడితే ఎలాంటి ప్రయోజనం ఉండదట. వాళ్లు మాట వినకపోవటం అటుంచి..మొండిగా తయారవుతారట. తాజాగా..కెనడా, జపాన్, రష్యా తదితర 69 దేశాల్లో ఈ అంశం పై అధ్యయనం చేశారు. అందులో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం.
పిల్లల్ని శారీరకంగా శిక్షించడం వల్ల వాళ్ల బుద్ధి మందగిస్తుందని, స్వతంత్రత కోల్పోయామన్న భావనతో కుంగుబాటుకు లోనవుతారని ఆ అధ్యయనంలో తేలింది. కొట్టడం వల్ల పిల్లలు మెరుగవుతారన్నది తల్లిదండ్రులు దురభిప్రాయం మాత్రమేనట.. దీనివల్ల వారు క్రూరంగా ప్రవర్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి సంబంధించి అధ్యయనంలో స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆయన అన్నారు.
కొన్ని దేశాల్లో చట్ట విరుద్ధం
ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో పిల్లల్ని శారీరకంగా హింసించడం చట్ట విరుద్ధం. మరో 27 దేశాల్లో చిన్నారులపై భౌతికదాడులను ఆపేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. అయితే, 31 దేశాల్లో మాత్రం చిన్నారుల్ని కొట్టినా నేరంగా పరిగణించడం లేదు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 25 కోట్ల మంది చిన్నారులు శారీరక హింసకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులు తమ పిల్లకు భయం చెప్పాలని అనుకుంటే..వారిని కొట్టి వదిలేయటం తప్పు..స్కూల్ మాష్టర్లు శిక్షించినట్లు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి. అలా చేస్తే ఈసారి వారు ఆ తప్పు చేయాలనప్పుడు ఇది పనిష్మెంట్ గుర్తుకువస్తుంది. అది కొడితే ఆ కొద్దిసేపటికే మార్చిపోతారు. పేరెంట్ ఇకనైనా..పిల్లలను హింసించటం మానేసి ప్రత్యామ్మాయ మార్గాలను చూసుకోవటం ఉత్తమం. ఇంకా ఇలా హింసించేవాళ్లలో కూడా తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులే ఎక్కవుగా ఉంటారు. జాబ్ చేసే వాళ్లు…చాలా వరకూ పనిష్మెంట్ మార్గాలనే ఎంచుకుంటున్నారట. అయితే అందరూ ఇలానే చేస్తారని కాదు. చదువుకున్న పేరెంట్స్ కూడా విచక్షణారహితంగా చిన్నపిల్లలను హింసించేవాళ్లు కూడా లేకపోలేదు. పసిహృదయాల్లో ఏర్పడిన గాయాలు..వారి భవిష్యత్ పై బాగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆ ఏజ్ లో వారిని ఎక్కువగా భయపెట్టటం, బాధపెట్టటం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.