BREAKING : బీజేపీకి హైకోర్టు షాక్‌.. మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌

-

మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపి వేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు దాఖలు చేసే చిట్టచివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు చట్టంలో వీలున్నదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సీవీ భాసర్‌రెడ్డి ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌లో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఎక్కడ ఉందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. ఓటర్ల నమోదుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలకు మొత్తంగా 130 మంది అభ్యర్దులకు సంబంధించి 199 నామినేషన్లు దాఖలయ్యియి. నిన్న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నిన్న అర్దరాత్రి వరకు నామినేషన్లు కొనసాగాయి.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం అప్లై చేసుకోగా.. ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31నాటికి ఉన్న ఓటర్ లిస్టు ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశించాలని కోరింది. ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version