టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్ట్ కీలక తీర్పు

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన కేసులో నిందితులను రిమాండ్ కు ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ ను హైకోర్టు తోసిపిచ్చింది. పోలీసులు ఏసీబీ ప్రొసీజర్ ఫాలో కాలేదని కోర్టు అభిప్రాయపడింది.

ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఏసీబీ మాత్రమే అరెస్టు చూపాలని పేర్కొంది. కాగా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ నిందితులను రిమాండ్ చేసే అర్హత లేదని ధర్మసనం వ్యాఖ్యానించింది. పిసి యాక్ట్ లో ఏసీబీ మాత్రమే అరెస్టు చూపాలని పేర్కొంది. అయితే తొలుత ఏసీబీ కోర్టు సైతం నిందితుల రిమాండ్ ను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని సిబిఐతో కానీ, సుప్రీం సెట్టింగ్ జడ్జ్ తో కానీ విచారణ జరిపించాలంటూ బిజెపి వేసిన పిటిషన్ ను శనివారం హైకోర్టు విచారించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version