వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు… ఏమిజరిగిందంటే..?

-

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో ఏపీ రాజకీయావర్గాల్లో చిన్నపాటి అలజడి నెలకొందనే చెప్పాలి! ఇంతకాలం టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు తగ్గట్లుగానే ఏపీ హైకోర్టు వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మధుసూదన్ రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, రజనీ లు ఉన్నారు! లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనేది వీరిపై మోపబడిన ఆరోపణలు!

అవును… కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈ ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, విడతల రజనీ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది పారా కిశోర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది ఇంద్రనీల్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.. ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

కాగా… లాక్ డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించలేదని, జనాలను గుంపులు గుంపులుగా చేరదీశారని ప్రతిపక్షాలు వీరిపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. నిత్య్యావసర సరుకుల పంపిణీ సమయంలో జనాలతో ఊరేగింపులు చేశారని మదుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకటగౌడ లపై ఆరోపణలు రాగా… పూలు చల్లించుకున్నారని, ఆ సమయంలో జనాలు భౌతికదూరం లేకుండా ఉన్నారని.. విడతల రజనీ జనాలను వేసుకుని ఊరేగింపులుగా తిరుగుతున్నారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version