బ్రేకింగ్ : ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజు వారీ విచారణ !

-

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అలానే నవంబర్‌ 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానం కూడ హైకోర్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.

High court

హై కోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాల్లో కోర్టులు మాత్రం తెరిచి భౌతిక విచారణ జరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ప్ర‌స్తుత‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని రాష్ర్టాల హైకోర్టులు సుప్రీంకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version