Sai Pallavi: సాయి పల్లవికి బిగ్ షాక్..తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ..!

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవికి బిగ్‌ షాక్‌ తగిలింది. వివాదస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి పిటిషన్ ను కొట్టి వేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. భజరంగ్ దళ్ సభ్యుడి ఫిర్యాదు మేరకు గత నెలలో సుల్తాన్ బజార్ పీఎస్ లో టాలీవుడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవిపై కేసు నమోదు అయింది.

ఈ మేరకు నటి సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. అయితే.. సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని హైకోర్టు ను ఆశ్రయించారు నటి సాయిపల్లవి.

అయితే.. ఈ పిటీషన్‌ పై తాజాగా విచారణ చేపట్టిన తెలంగాణ హై కోర్టు… నోటీసులు రద్దు చేయాలన్న నటి సాయిపల్లవి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో హీరోయిన్‌ సాయిపల్లవికి బిగ్‌ షాక్‌ తగిలింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తీర్పుపై సాయిపల్లవి ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version