పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా.. అయితే నష్టం తప్పదు..!!

-

ఏ కాలంలో నైనా ఎక్కువగా పండేటువంటి కాయలు పుచ్చకాయ కూడా ఒకటి. ఈ కాయ ఎక్కువగా సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా ఎలాంటి కొవ్వు పదార్థాలు లేకుండా ఉంటుందని అందుచేతనే వైద్యులు అప్పుడప్పుడు తినమని తెలియజేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడైతే అతిగా తింటామో అప్పుడే అనర్ధాలకు దారి తీస్తుంది అన్నట్లుగా తెలుస్తోంది. ఆ అనర్ధాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పుచ్చకాయ చాలా చల్లగా తీయగా ఉంటుందని ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. పుచ్చకాయల నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుంది. అయితే అతిగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పుచ్చకాయని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం డయేరియా , గ్యాస్ సంబంధించిన సమస్యలు వస్తాయి.

పుచ్చ కాయ ఎక్కువగా తినడం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా లివర్ పైన చూపుతుందట. దీంతో మన ఆరోగ్యం ప్రమాదానికి గురవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారు పుచ్చకాయని అసలు తినకూడదు. ఎందుచేత అంటే పుచ్చకాయలు లైకోఫిల్ ఆల్కహాల్ తో వ్యతిరేకంగా పనిచేయడం వల్ల లివర్ వాపు కు గురవుతుంది.

మన శరీరం సరిపడు నీటిని అందించకపోతే డీహైడ్రేట్ అయినట్లుగానే నీటి శాతం ఎక్కువగా ఉంది అంటే అది శరీరానికి మంచిది కాదు. మన శరీరంలో నీటి శాతం పెరిగినట్లు అయితే సోడియం శాతం కోల్పోయే అవకాశం ఉంటుంది.

పుచ్చకాయలో ఎక్కువగా పొటాషియం లభిస్తుంది దీంతో మన శరీరానికి అవసరమైన పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ పుచ్చకాయలను అధికంగా తిన్నట్లు అయితే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇక అంతే కాకుండా దీనివల్ల గుండె స్పందనలో పలుమార్పులు చోటుచేసుకుని పలుసు రేటు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుచేతనే ఎవరైనా పుచ్చకాయలు ఎక్కువగా తినే వారు ఉంటే తగ్గించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version