ఎలక్షన్ కమిషన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అలానే హైకోర్టులో బిజెపికి ఊరట లభించింది. పెన్ తో టిక్ పెట్టినా ఓట్లు వేసినట్టేనని నిన్న రాత్రి ఎన్నికల కమిషన్ సర్కులర్ జారీ చేసింది. నిన్న అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సర్క్యులర్ సరైనది కాదని బీజేపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్కులర్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ కు సవాల్ చేస్తూ నిన్న రాత్రి హైకోర్టులో బిజెపి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఇక స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లు మాత్రమే చెందుతాయని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్కులర్ ను హైకోర్టు కొట్టివేసింది. పెన్ తో టిక్ పెట్టినా ఓట్లు వేసినట్టేనని నిన్న రాత్రి ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. దీని గురించి నిన్న అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ మీద ప్రభుత్వం మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కుమ్మక్కయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయితే ఇప్పుడు హైకోర్టులో బిజెపికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి.