ఈ కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఆనందయ్య. ఆయన తయారు చేసిన కరోనా మందు అద్భుతంగా పనిచేస్తోందని ఇప్పటికే ఎన్నో వార్తలు రావడంతో లక్షలాది మందిఆ మందు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మందు పంపిణీ ఎప్పుడు చేస్తారో ఎవరికీ తెలియకుండా ఉంది. ఇకదీనిపై విచారించిన కోర్టు ఆసక్తికర కామెంట్లు చేసింది.
ఆనందయ్య మందు పంపిణీ గురించిన సచాచారం కోసం 4 రోజులు సమయమిచ్చినా పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు సీరియస్‌గా ప్రశ్నించింది. మందు పంపిణీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెంటనే తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
ఇక అటు ఆనందయ్య నాటు మందుపై కాసేపట్లో ప్రభుత్వం సమీక్ష జరుపి, నిర్ణయం తీసుకుంటుందని గవర్నమెంట్ తరుఫు లాయర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సమీక్ష తర్వాత నిర్ణయం తమకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. దాని తర్వాత మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని వెల్లడించింది. విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది ధర్మాసనం.