ఇంకా మార్చి నెల కూడా పూర్తి కాలేదు అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు ప్రారంభమయ్యే రేపటి నుంచి మరింతగా వడగాలులు ఉధృతం కానున్నాయి అని చెబుతున్నారు. ఈరోజు నుంచి చాలా ప్రాంతాల్లో 4 నుంచి 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో మహబూబాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలులు ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.