హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

-

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ పరిధిలోని పురానాపూల్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో మంటలు చెలరేగడంతో పక్కన ఉన్న మరో ఐదు దుకాణాలకు కూడా మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే అర్ధ రాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మొత్తం నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించినా అవి అదుపులోకి రావడం లేదు. ప్రాధమికంగా ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలెనే జరిగిందని చెబుతున్నారు. దాదాపు కోటిన్నర రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక దీనికి సంబంధించి మరింత సమాచారం అందె అవాక్షం ఉంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version