వరంగల్ జిల్లా ఈటెల స్వగ్రామం కమలాపూర్ లో అభిమానులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ సహా హుజురాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈటెల నివాసంతో పాటు కమలాపూర్ లో కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈటల నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఎవరైతే ఆందోళనకు దిగుతారని భావిస్తున్నారో వారందరినీ నిర్బంధం చేస్తున్నారు.
ఈటల మీద వేటు వేసే ఉద్దేశంతోనే పోలీసులు ఈ మేరకు మోహరించారు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి మీడియాతో స్పందిస్తూ విచారణ ఆధారంగానే మంత్రి ఈటల మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదులు అందాయి కాబట్టి విచారణకు ఆదేశించాలని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఆయన అన్నారు. బీసీలకు టిఆర్ఎస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ వ్యవహారాన్ని బీసీ కోణంలో చూపే ప్రయత్నం సరికాదని అన్నారు.