బ్రేకింగ్ : రేవంత్ ఇంటిని ముట్టడించిన టీఆర్ఎస్ నేతలు

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాసేపటి క్రితమే…. పీసీసీ చీఫ్‌ ఇంటి ముట్టడికి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే…. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు…. వెంటనే అక్కడి కి చేరుకున్నారు.

రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టిడి చేయడానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యం లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మరియు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పై రేవంత్‌ రెడ్డి నిన్న… చేసిన వ్యాఖ్యలకు నిరసన గా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన కు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version