వినాయక నిమజ్జనం ఊరేగింపులో జూ.ఎన్టీఆర్ జెండాలు

-

తెలుగు దేశం పార్టీ లో మరో సారి జూనియర్‌ ఎన్టీఆర్‌ హాట్‌ టాపిక్‌ గా మారారు. నిన్న నిమజ్జనం సమయం లో మరోసారి తెరపైకి జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు వచ్చాయి. వినాయక నిమజ్జనం ఊరేగింపు లో జూని యర్‌ ఎన్టీఆర్‌ జెండాలు హల్‌ చల్‌ చేశాయి. నెక్ట్స్‌ సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

అయితే.. ఈ వింత ఘటన కృష్ణా జిల్లా బంటు మిల్లి మండలం అర్తమూరు గ్రామం లో చోటు చేసుకుంది. అంతేకాదు.. ప్లాగ్స్‌ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు మరియు నారా లోకేష్‌ ల ఫోటోలు కనిపించక పోవడం గమనార్హం.

కాగా.. 2019 సంవత్సరం లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీకి వెళ్లడమే తప్ప… వచ్చే వారే కరువయ్యారు. అంతేకాదు.. చంద్ర బాబు మరియు నారా లోకేష్‌ నాయకత్వాన్ని కూడా నేతలు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యం లోనే జూ. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలనే పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version