ముంబై ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరుగనుంది. ఇవాళ హైదరాబాద్ AIG నుంచి డిశ్చార్జ్ కానున్నారు కొడాలి నాని. గుండెలో మూడు వాల్వ్స్ బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ చేయనున్నారు. కొడాలి నానికి డాక్టర్ పాండా ఆపరేషన్ చేయనున్నారు.

గతంలో మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ కి బైపాస్ సర్జరీ చేసిన పాండా… ఇటీవలే కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజుకు బైపాస్ చేసారు. ఇక ఇప్పుడు ముంబై ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ముంబై వెళ్తున్న కొడాలి నానికి రేపు లేదా ఎల్లుండి బైపాస్ సర్జరీ జరుగనుంది.