గుంటూరు జిల్లా వెలగపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం జరిగిన గొడవ జరగగా దానిని పోలీసులు తీర్చారు. ఇప్పుడు మరలా వివాదం రేగడంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఒక ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. వెలగపూడిలోని ఎస్సీ కాలనీ ఆర్చ్ నిర్మాణాన్ని మరో సామాజిక వర్గం అడ్డుకున్న క్రమంలో ఈ వివాదం మొదలైంది. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పర వివాదం చెలరేగింది. ఆ వివాదం దాడులకు దారితీసింది.
ఈ దాడుల్లో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. తమ స్థలంలో నిర్మాణం చేస్తున్నారంటూ మరో సామాజిక వర్గం ఈ ఆర్చి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాని కోసం వేసిన పిల్లర్లు తొలగించింది. ఇదే వివాదానికి కారణం అయినట్లు చెబుతున్నారు ఈ క్రమంలో వెలగపూడి లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. స్థానిక నేతల కారణంగానే గొడవలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పిన అప్పటికి సైలెంట్ అయ్యి ఇప్పుడు మరలా వివాదం మొదలు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.