దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్ర వేడి వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ తీవ్ర వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. భువనేశ్వర్ ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవ్వడంతో ఐఎండి ఒడిస్సా అంతటా అత్యధిక ఎండ తీవ్రత హెచ్చరిక ని జారీ చేసింది.
ఒడిశాలో కొన్ని ప్రాంతాలలో ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో వేడిగాలులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. రాష్ట్రంలో 27 నగరాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి భువనేశ్వర్ డైరెక్టర్ మనోరమ మొహంతీ చెప్పారు తీవ్ర ప్రాంతాల్లో వేడి తేమతో కూడిన పరిస్థితులు ఉండొచ్చని చెప్పారు 21 తర్వాత వర్షాలు ఉరుములు ఈదురు గాలులతో కొంచెం ఉపశమనం ఉంటుందని అన్నారు.