ఏపీలోనే అత్యధిక నిరుద్యోగం అన్నారు నారా లోకేశ్. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ Xలో విమర్శించారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.
యువత నిరాశ, నిస్పృహాలతో కొట్టుమిట్టాడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రం, యువత భవిత మెరుగుపడాలని ఆకాంక్షించారు.
కాగా యువగళం పాదయాత్ర 219వరోజు తుని నియోజకవర్గం తేటగుంట వద్ద 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు లోకేష్. ప్రత్యేకమైన ఈ రోజు బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ నాతోపాటు అడుగులు వేశారు. తుని పట్టణంలో అశేష ప్రజానీకం లోకేష్ వెంట నడిచింది. తాండవబ్రిడ్జి వద్ద ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టిన పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది.