హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి కరోనా నిర్ధారణ కావడంతో ఇప్పుడు మాస్కులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎస్ 95 మాసుకులు వాడాలని ప్రభుత్వం చెప్పిన నేపధ్యంలో ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో వ్యాపారులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. మాస్కుల ధరలకు రెక్కలు వచ్చాయి. అసలు ఊహకు కూడా అందని ధరలతో చెలరేగిపోతున్నారు. రెండులేయర్లతో ఉన్న మాస్క్ హోల్‌సేల్ ధర రూ.1.60.
కాని కొన్ని మెడికల్ షాపులు మాత్రం రూ.20-25 వరకు, అదే రూ.30-40 విలువ చేసే ఎన్ 95 మాస్క్‌ను రూ.300 వరకు జనాలకు అమ్ముతున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా తో వ్యాపారం చేయవద్దు అని చెప్పినా సరే రెచ్చిపోతున్నారు. మాస్కుల కొరత ఏమీ లేదని తెలంగాణా సర్కార్ చెప్తుంది. ప్రభుత్వం అందుబాటులో ఉంచింది కూడా. అయినా సరే వ్యాపారులు ఈ దోపిడి కి తెర లేపారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద కూడా మాస్కుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. జనరిక్ మెడికల్ షాపుల్లో దుకాణాల్లో సాధారణ మాస్కుల ధర రూ.15-20గా ఉంది. కావాలి అనే కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారులు రెచ్చిపోవడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంద మార్కుల ధర గతంలో 160 ఉంటే ఇప్పుడు అది రెండు వేల వరకు అమ్ముతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.