బంగారం భగ భగ ,వెండి విల విల ..!

-

కొన్నాళ్ళుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. ఒక్కసారే రెండు వేల వరకు తగ్గిన బంగారం ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశీయంగా బంగారం ధరలు కాస్త పెరగడం ఇప్పుడు సంతోషం కలిగించే అంశం. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర కాస్త పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,780 రూపాయల నుంచి 43,790 రూపాయల వరకు వెళ్ళింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, 10 గ్రాములకు 160 రూపాయలు పెరిగింది. దీంతో 39,980 రూపాయల నుంచి 40,140 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,200 రూపాయలకు వెళ్ళింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,000 రూపాయలకు చేరింది. గత కొన్నాళ్ళుగా బంగారం అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ నెల 8 నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు పెరుగుతున్నాయి. తగ్గినప్పుడు కూడా బంగారం అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. కరోనా దెబ్బకు ఇంకా తగ్గుతుంది అని ఎదురు చూసారని, కాని పెరగడం షాక్ కి గురి చేసిందని అవసరం అయితేనే కొంటున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version