పెండ్లికొడుక్కు చుక్క‌లు చూపించిన హిజ్రాలు.. అస‌లేమైందంటే..?

-

కొన్ని సందర్భాల్లో తమకు కావాల్సినంత డబ్బులు ఇవ్వలేదని కొంత మంది నానా యాగీ చేస్తారు. చివరకు ఉత్తి చేతులతో ఖాళీగా వెళ్తారు. అటువంటి కోవలోనికే వస్తుంది ప్రస్తుతం జరిగిన గొడవ. బిహార్ లోని వైశాలి పట్టణంలో ఓ వ్యక్తి తన పెళ్లి కోసమని బయళ్దేరి కారులో వెళ్తున్నాడు. అంతలో కారును కొంత మంది హిజ్రాలు అడ్డుకుని తమకు బక్షీస్ ఇవ్వాలని అడిగారు. దీంతో ఆ పెళ్లి కొడుకు కొంత మొత్తాన్ని వారికి ఇచ్చాడు.

కానీ దానితో తృప్తి పడని హిజ్రాలు మాకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కానీ అటు తర్వాత వారు ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇలా హిజ్రాలు ఇచ్చిన డబ్బులను తీసుకోకుండా ఎక్కువ డబ్బులను డిమాండ్ చేస్తుండడంతో కోపంతో పెళ్లి కొడుకు ఉన్న కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు ఏం చేయాలో తోచక ఆ కారును వెంబడించారు.

ఇలా ఆ కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ పెట్రోల్ పంపులో ఇంధనం నింపుకోవడం కోసం ఆగింది. అక్కడకు వచ్చిన హిజ్రాలు ఆ కారు తమలో ఒకరిని గుద్దిందని ఆరోపించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆరోపించడంతో ఏం చేయాలో తోచని పెళ్లి కొడుకు తరపు బంధువులు గొడవకు దిగారు. అయినా కానీ హిజ్రాలు తగ్గలేదు. ఇదంతా పెట్రోల్ పంపులో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. అనంతరం అక్కడి నుంచి కూడా పెళ్లి కొడుకు ఉన్న కారు వేగంగా దూసుకుని వెళ్లిపోయింది. అటు తర్వాత అక్కడకు పోలీసులు చేరుకుని హిజ్రాలను పంపించేశారు. కాగా అక్కడ గొడవ పెద్దది కాకపోవడంతో అందరూ ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version