ఆహ్వానిస్తే.. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరుతా: కమల్ హాసన్

-

మక్కల్ నీది మాయం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. 2024, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేకంగా కూటమిలో చేరికపై స్పష్టత ఇచ్చారు. ఎవరైనా ఆహ్వానిస్తే తప్పకుండా చేరుతానని తెలిపారు. పరిస్థితులు, ఆహ్వానం మేరకు తమ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరిక విషయం పరిశీలిస్తుందని కమల్ హాసన్ విలేకరులకు తెలిపారు.

పెగాసస్ ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 11 రోజులుగా స్తంభించడంపై రిపోర్టులు ప్రశ్నించగా పెగాసస్‌ వ్యవహారానికి ప్రతిచర్యగానే పార్లమెంట్‌లో చోటుచేసుకుంటున్నదని తెలిపారు. ‘ఇది నిఘా ప్రభుత్వం కాదు. మీరు నా వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడలేరు’ అని కమల్‌ హాసన్ అభిప్రాయపడ్డారు.

మేకెదట్టు ఆనకట్ట వ్యవహారంపై చమత్కారంగా స్పందించారు. సినిమాల్లో నేను ద్విపాత్రాభినయం చేశాను. రాజకీయాల్లో ద్విపాత్రాభినయం ఎవరు చేస్తున్నారో నేను గుర్తించగలను. వారి పేర్లు మాత్రమే వేరు. ఇద్దరూ కేంద్ర ప్రభుత్వం చేతిలో తోలు బొమ్మలే అని కమల్ హాసన్ చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version