హిందీ పేపర్ లీక్ కాలేదు – మంత్రి సబితా

-

తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో మరో ప్రశ్న పత్రం లీక్ అయింది. రెండవ రోజు హిందీ పరీక్ష ప్రారంభమైన కాసేపటికి ఆ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వ్యవహారం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు.

10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా హిందీ పేపర్ లీక్ కాలేదని మంత్రి సబితా స్పష్టం చేశారు. ప్రశ్న పత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. నిజాలు తేల్చేందుకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి సబిత డీఈవో లను ఆదేశించారు. వరుస లీకులపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version