మళ్ళీ కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ రానుందా? అధికారంలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేయనున్నారా? అంటే ప్రస్తుతం కేంద్రంలో జరుగుతున్నా రాజకీయ పరిణామాలని గమనిస్తే అదే జరిగేలా ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికార బిజేపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎన్డీయే, యూపీఏ ఉన్నాయి..ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ చర్చ మళ్ళీ మొదలైంది.
ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కేసిఆర్, మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ లాంటి వారు పోరాడుతున్నారు. అయితే వీరంతా ఏకతాటిపైకి రావడానికి చూస్తున్నారు. దీనికి కేసిఆర్ నాయకత్వం వహించాలని చూస్తున్నారు. తాజాగా కేసిఆర్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అదే నిజమనే పరిస్తితి. తనని ప్రతిపక్షాల కూటమికి ఛైర్మన్ చేస్తే..2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష పార్టీకి అయ్యే మొత్తం ఖర్చుని తానే భరిస్తానని అంతర్గత సమావేశాల్లో చెప్పారు. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది.
అయితే కేసిఆర్ కు విపక్ష పార్టీలు ఆ ఛాన్స్ ఇస్తాయా? అంటే చెప్పడం కష్టమే. ఎందుయికంటే మమతా గాని, శరద్ పవార్, కేజ్రీవాల్ ఇంకా కొందరు నేతలు తాము కూడా ప్రధాని రేసులో ఉన్నామని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ కు ఛాన్స్ ఇవ్వడం అనేది కష్టమే. ఇదే సమయంలో కాంగ్రెస్ లేకుండా విపక్షాల కూటమి నెగ్గడం కష్టం. కాంగ్రెస్ పార్టీతో పలు పార్టీలు ఒక కూటమి గా ఉన్నాయి. అవి కేసిఆర్ లాంటి వారికి మద్ధతు ఇస్తాయని అనుకోవడం కష్టం. ఏదో కొంతమంది విపక్ష నేతలు కలిసినంత మాత్రాన బిజేపికి చెక్ పెట్టడం సాధ్యం కాకపోవచ్చు.
కాంగ్రెస్ లేకుండా విపక్షాలు కూటమి కట్టిన ఉపయోగం ఉండదు. కాంగ్రెస్ తో సహ అన్నీ విపక్షాలు ఏకమైతేనే..బిజేపికి చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అలా కుదరని పక్షంలో బిజేపిని నిలువరించడం కష్టం.