భక్తుల తెచ్చే ఆల్కహాల్ ను నేరుగా స్వామి వారి నోట్లో పోయడం జరుగుతుంది. పోసిన తక్షణం ఆల్కహాల్ మాయం అవ్వడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మన భూప్రపంచం మీద సైన్స్‌కు అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఆ క్రమంలోనే కొన్ని దేవాలయాల్లో ఎవరికీ అంతుచిక్కని వింతలు జరుగుతుంటాయి. దేవాలయాల్లో జరిగే పూజలు, కార్యక్రమాలు, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. కానీ భక్తి ప్రజలను విచిత్ర సంప్రదాయాలను విశ్వసించేలా చేస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని ఆలయాల్లో విచిత్ర ఆచారాలను చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
సాధారణంగా ఆలయం లోపల, పరిసరాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. ఇక్కడ మాత్రం కాదు. పూలు, కొబ్బరికాయలతో పాటుగా భక్తులు ఇక్కడ కొలువుదీరిన కాలభైరవుడికి ఒక సీసా మద్యం కూడా సమర్పిస్తారు. మద్యం విక్రయించేందుకు ఆలయం వెలుపల దుకాణాలు కూడా ఉన్నాయి. మరి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కాలభైరవుడి ఆలయం ఉంది. శివుని అంశగా వెలసిన రౌద్రనాథుడు కాలకేయుడు.
శివుని మరో రూపంగా శివగణాలలో అత్యంత శక్తిమంతుడుగా పేరుగాంచిన కాలకేయుడిని యుగయుగాలుగా అమిత భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు. మరి ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు శివుడి కోసం నారికేళ్ళను తీసుకెళ్ళడం అనాది కాలం నుండి సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆలయంలో దేవుడికి ఆల్కహాల్ ను నైవేద్యంగా, ప్రసాదంగా అందివ్వడం అక్కడ ప్రజల ఆచారం. భక్తుల తెచ్చే ఆల్కహాల్ ను నేరుగా స్వామి వారి నోట్లో పోయడం జరుగుతుంది. పోసిన తక్షణం ఆల్కహాల్ మాయం అవ్వడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీన్ని అక్కడ ప్రజలు ఓ ఆచారంగా భావిస్తారు.