HMPV వైరస్ కేసులు..గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు

-

చైనాలో మరోసారి కొత్తగా వెలుగుచూసిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులో దేశంలో క్రమంగా పెరుతున్నాయి. ఇటీవల ఒక్కసారిగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీచేసింది. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో హెచ్ఎంపీవీ వైరస్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, ఈ వైరస్తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, ఇది కూడా కరోనా వైరస్ లాంటిదేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో సైతం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version