‘కల్కి’ మూవీపై హాలీవుడ్‌ డైరెక్టర్‌ కామెంట్స్‌ !

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .కల్కి షూటింగ్ శరవేగంగా సాగుతోంది.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ తమ్ముడు జోనాథన్‌ నోలన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన జోనాథన్‌.. ‘కల్కి’ గురించి, ఇండియన్‌ సినిమాలపై చేసిన కామెంట్స్‌ నెట్టింట్లా షేర్‌ అవుతున్నాయి.ఇండియన్ సినిమా లొకేషన్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే స్టంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. నాకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలను తెరకెక్కించడం ఇష్టం. అవి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తాయి. ఈ మూవీ మేకర్స్‌ సలహా తీసుకునే స్థాయిలో లేరు. వాళ్లు ఏం చేస్తున్నారో వారికి బాగా తెలుసు అని అన్నారు. వారు అన్నీ ప్రాక్టికల్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం భారత దర్శక, నిర్మాతలు హాలీవుడ్‌ వారి కంటే గొప్పగా పని చేస్తున్నారు అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ సన్నివేశాన్ని క్లియర్‌గా చూపుతున్నారు” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news