ఇంట్లోకి అడుగుపెట్టగానే బండెడు బట్టలు ఒక పక్కన గుట్టలా పేరుకుపోయి కనిపిస్తుంటే, మరో పక్కన పేపర్లు, పుస్తకాలతో చిందరవందరగా ఉంటే.. ఇంకో పక్కన లాప్ టాప్, హెడ్సెట్ మొదలగు గ్యాడ్జెట్స్ తో నిండిపోయి వాటి వైర్లు ఒకదానిలో ఒకటి చిక్కుకుపోయి.. అస్తవ్యస్తంగా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది.
మీకే కాదు.. ఎవరికైనా చిరాకు వేస్తుంది. ఎస్.. మీరు నివాసముండే ఇల్లు గందరగోళంగా చిందరవందరగా చెత్త పేరుకుపోయి ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు.
అన్ని వస్తువులు క్రమ పద్ధతిలో ఫలానా ప్రాంతంలో ఉండేందుకు ఇదేమి మ్యూజియం కాదు ఇల్లు అని మీరు అంటారేమో.
బట్ చెత్త పేరుకుపోయిన ఇంట్లో మీరున్నట్లయితే.. మీ ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఉదాహరణకు.. మీరు బైక్ కీస్ ని రోజుకు ఒకచోట పడేస్తారు. అలా పడవేయడం వల్ల బైకు కావలసినప్పుడు ఆ కీ… తొందరగా దొరకదు. దానివల్ల మీకు చిరాకు కలుగుతుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ ఒకే దగ్గర పెడితే మీకు కీ తొందరగా దొరుకుతుంది. చిరాకు అనేది ఉండదు. అంటే ఒక రకంగా మీకు స్ట్రెస్ లేదన్నమాట.
ఇంకో విషయం.. ఇల్లంతా బొమ్మలు, వస్తువులు గాడ్జెట్ లతో నిండిపోయి ఉంటే.. మీరు ఆ వస్తువుల్లో ఒక దాని మీద కాలు వేసి కింద పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఇంటిని రకరకాల వస్తువులతో నింపేయకండి. కాస్త స్పేస్ ఉంచుకోండి.
ముఖ్యంగా ఇల్లు నీటుగా లేకపోతే.. మతిమరుపు సమస్యలు వస్తాయి. ఏది ఎక్కడ పెట్టారో గుర్తుండకపోవడం వల్ల అవతలి వారి మీద అరుస్తారు. దాంతో వాళ్లకు మీకు ఉన్న రిలేషన్ షిప్ చెడిపోతుంది. కాబట్టి ఇంటిని నీట్ గా ఉంచుకుంటే జీవితంలో ఎదుగుతారు.