కాంగ్రెస్ పార్టీ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

కాంగ్రెస్ పార్టీ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండి. పదేళ్ల తరువాత అధికారంలోకి తేవడానికి కష్టపడ్డాం.. నోటికాడ పళ్ళెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు సర్వశక్తులు ఓడిన కార్యకర్తలకు అండగా ఉండండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 

పదేళ్ల కాలంలో ఎవడెవడో తినిపోయాడు. మనకు అవకాశం లేదు. మనకెవ్వరికీ కూడా బాధ అనిపించలేదు. పదవీ కావాలని కోరుకున్నాం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది.. మన ప్రభుత్వంలో మన హక్కుగా ఉన్నదాన్ని ఎవడైనా లాక్కూనిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. పదేళ్లు పోరాటం చేసిన తరువాత.. పొరిగింటోడు వచ్చి లాక్కుంటే చూస్తుంటారా అన్నారు. జగిత్యాల జిల్లా ప్రధాన కార్యకర్తగా చెబుతున్నానని ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version