అధిక బరువు తగ్గడానికి ఇంటి చిట్కాలు ..!

-

ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసి రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. తరువాత ఒక అరగంట ఆగి మళ్ళీ రెండు గ్లాసుల నీటిని తాగాలి. తరువాత బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఒక గ్లాసు జ్యూస్ తాగండి. జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్ కాదు సుమా !

1.కరివేపాకు,మునగాకు వీటిలో మునగాకు ఎక్కువ,కరివేపాకు తక్కువ ఉండాలి.

2. కొత్తిమీర,పుదీనా,తులసి ఆకులు వీటిలో తులసి ఆకులు తక్కువ మిగతావి ఎక్కువ ఉండాలి.

3.పచ్చి కూరగాయలు జ్యూస్.అంటే రెండు టమోటో లు,ఒక కీరా లేదా ఒక సొర కాయ,రెండు టొమాటో లు కలిపి తీసుకోవాలి.

4.క్యారట్,బీట్ రూట్.వీటిలో క్యారట్ ఎక్కువ బీట్ రూట్ తక్కువ ఉండాలి. షుగర్ పేషెంట్లు ఈ జ్యూస్ వాడకూడదు. ఈ పైన తెలిపిన జ్యూస్ లలో ఏది మీకు అనుకూలము అయితే దాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్,సాయంత్రం స్నాక్స్ కి ముందు ఒక గ్లాసు నిమ్మ రసము,తేనె కలిపి తాగాలి.

5.మధ్యాహ్నము భోజనానికి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. భోజనం తరువాత ఒక అరగంట ఆగి ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.తరువాత గంట గంటలకి నీళ్ళు తాగుతూ ఉండాలి.రాత్రి భోజనం త్వరగా అంటే 7గంటలలోపే చేయాలి.ఇలా 15రోజులు చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version