కాలం మారింది, అమ్మాయిలను అబ్బాయిలు మోసం చేయటమే కాదు.. అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్య కృత్యంగా మారాయి. పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వలపు వలవేసి ప్రేమ పెళ్లి పేరుతో దోచుకుంటున్న వారు కొందరైతే, పెళ్లిళ్లు చేసుకుని నిత్య పెళ్లికూతుళ్ళుగా ఊడయిస్తున్న వారు ఇంకొందరు. ఇక ట్రాప్ చేసి శృంగారపు ఉచ్చలో మోసం చేస్తున్నవారు మరికొందరు.
ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళను ట్రాప్ చేసి వారి ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే మోసాలకు పాల్పడితే.. ఇప్పుడు ఆ పనిలో మగవాళ్ళని మించిపోయారు మహిళలు. హనీ ట్రాప్ తో మగవాళ్లను ముగ్గులోకి దించడం, వారు చెప్పినది చేసేలా చేయడం ఆపై వారిని బెదిరించడం, దండుకోవడం నిత్య కృత్యంగా మారుతుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓర చూపుతో యువకులను లైన్లో పెడుతుంది ఓ అవివాహిత.
చాటింగ్, వీడియో కాల్స్ తో చనువు పెంచుకొని.. అప్పు రూపంలో యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది ఈ యువతి. తిరిగి డబ్బులు అడిగితే వీడియోలు వారి స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరిస్తోంది. ఎదురు తిరిగితే అత్యాచారయత్నం కేసులు పెడుతుంది యువతి. తాజాగా ఈ హనీ ట్రాప్ లో పడ్డారు ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి, ఓ కానిస్టేబుల్ బంధువు. డబ్బులు తిరిగి అడిగితే వారి వీడియోలు బయటపెడతానంటూ బెదిరించింది యువతి. దీంతో ఆ కిలాడి యువతిపై ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.