మొబైల్స్ తయారీదారు హువావే భారత్‌లో హానర్ 9ఎస్, హానర్ 9ఎ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి చాలా తక్కువ ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిలో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్లు…
* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్
* 32జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ
హానర్ 9ఎ స్పెసిఫికేషన్లు…
* 6.3 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 13, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
హానర్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో రూ.6499 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 6 నుంచి లభిస్తుంది. ఆరంభంలో ఆఫర్ కింద రూ.5,999 ధరకే దీన్ని అందిస్తారు. హానర్ 9ఎ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్లలో రూ.9,999 ధరకు అమెజాన్‌లో ఆగస్టు 6 నుంచి లభిస్తుంది. ఆరంభంలో ఆఫర్ కింద దీన్ని రూ.8,999 ధరకే కొనవచ్చు. రెండింటి మీద 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు యూజర్లు ఈ ఫోన్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.