రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం తన వ్యక్తిగత సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా ఆయనొక పోస్టు పెట్టారు.
‘బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు. బీజేపీ నుండి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.
కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు,64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.
కొత్త పరిశ్రమలు కావాలని అడగరు ..ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదు. ఈ తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవు’ అని రాసుకొచ్చారు.