మమ్మల్ని అమ్మొద్దన్నారు.. ఇప్పుడు అమ్ముతామంటున్నారు : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం అయ్యాక ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు.. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు .

ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ భట్టి విక్రమార్క, సీతక్కగారు పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారు అంటున్నారు.ఇప్పుడు ఏమో ఇంకా 14 వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారు అన్నారు. ఈరోజు బరాబర్ భూములు అమ్ముతాము అంటున్నారు’ అని హరీష్ రావు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news