‘ఒకే ఒక జీవితం’తో శర్వానంద్ ఖాతాలో విజయం..సినిమాపై భారీ అంచనాలు

-

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన చిత్రాలుంటాయి. ప్రతీ ఒక్కరు శర్వానంద్ సినిమాను చూడొచ్చు అనే అభిప్రాయం ఆయన తన ఫిల్మ్స్ ద్వారా కలిగించారు.

ఇక దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘శతమానం భవతి’ పిక్చర్ సూపర్ హిట్ అయింది. కాగా, ఈ చిత్రం తర్వాత వచ్చిన చిత్రాలన్నీ కూడా ఆ స్థాయిలో ఆడటం లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రాబోయే శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా డెఫినెట్ గా విజయం సాధిస్తుందని సినీ అభిమానులు అంటున్నారు.

తెలుగు-తమిళ్ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మ్యుజీషియన్ గా శర్వానంద్ కనిపించనున్నారు. అమ్మ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో చక్కటి పాటను ప్రముఖ సినీ గీత రచయిత దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

అక్కినేని అమల ఇందులో కీలక పాత్ర పోషించగా, హీరోయిన్ గా రీతూ వర్మ నటించింది. శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. ఈ నెల 9న సినిమా రలీజ్ కానుంది. అమ్మ సెంటిమెంట్ తో పాటు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. శర్వానంద్ గత చిత్రాలు ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ‘ఒకే ఒక జీవితం’ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని సినీ ప్రియులు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version