జూలై 31 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

జూలై 31- శ్రావణమాసం- ద్వాదశి. శుక్రవారం

మేష రాశి: ఈరాశి విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపండి !

ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారం బంధాన్ని బలోపేతం చేస్తాయి. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. విద్యార్థులకు ముఖ్యమైన సూచన చదువుపట్ల శ్రద్ద చూపించి ముందుకు వెళ్ళండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

పరిహారాలుః పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలలో, కుటుంబంలో ఆనందం, శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులను దానం చేయండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు !

అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్లో ఉంటారు., కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగ వచ్చు. దీని వలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈరాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసు కుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుందిమీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, పండ్లు మీ కోసం సిద్దం చేస్తారు.

పరిహారాలుః పెన్, నోట్బుక్, పెన్సిల్ వంటి స్టేషనరీ వస్తువులను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది.

 

మిథున రాశి: ఈరోజు అనవసర ఖర్చులు పెట్టకండి !

ఈరోజు మీ ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ అతిఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ద కలిగిఉండాలి. పని వత్తిడి, మీ మనసును ఆక్రమించుకున్నాగానీ, డబ్బు సంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది.

పరిహారాలుః మంచి విలువలు, మంచి స్వభావంతో ఉండండి. మీ కుటుంబ జీవితానికి ఆనందకరమైన క్షణాలను జోడించండి.

 

కర్కాటక రాశి: ఈరోజు కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వండి !

ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందు తారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. మీ టీమ్ లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు . సమయాన్ని సద్వినియోగం చేఉకోవటంతోపాటు, మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ, దానిని అమలు పరచటంలో విఫలం చెందుతారు.

పరిహారాలుః అవసరమయ్యే ప్రజలకు బార్లీ, ముల్లంగి, నల్ల ఆవాలు విత్తనాలు దానం చేయండి మరియు ఆరోగ్యంగా ఉండండి.

 

సింహ రాశి: ఈరోజు పదోన్నతికి అవకాశాలు !

చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది.

పరిహారాలుః శ్రీవరలక్ష్మీ అమ్మవారి పూజ లేదా ధ్యానం చేయండి.

 

కన్యా రాశి: ఈరోజు నిగ్రహాన్ని కోల్పోకండి !

ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, సామరస్య బంధాలను కొనసాగించే ప్ర్యత్నం చెయ్యండి. ఈరోజు మీ విచక్షణను వాడండి. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు.

పరిహారాలుః శివుడు, భైరవుడు, హనుమంతుడిని ఆరాధించడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం పొందండి.

 

తులా రాశి: ఈరోజు యోగా, ధ్యానం చేయండి !

ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైమ్. ఎందుకంటే, మీ మానసిక వత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్ధికంగా బాగుంటారు.  మీదగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. రోజు రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు.

పరిహారాలుః ఒక ఆనందకరమైన జీవితం కోసం శుక్రవారం శ్రీవరలక్ష్మీ దేవి ధ్యానం, పూజ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

 

వృశ్చిక రాశి: ఈరోజు లాభాలు వస్తాయి !

పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి. మీరు డబ్బుని ఇతర ప్రదేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. ఒక్కవైపు ఆకర్షణం, ఈరోజు వినాశకారిగిగా ఋజువు అవుతుంది.  ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

పరిహారాలుః కుటుంబ సంతోషం పొందటానికి, ఏదైనా హనుమాన్ ఆలయంలో దానిమ్మ పండ్లు సమర్పించండి.

 

ధనుస్సు రాశి: ఈరోజు పెండింగ్‌ పనులు పూర్తి !

పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు. వీరి అదృష్టం మీరు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. మీరు పెండింగ్ పనులు పూర్తి చెయ్యడం లో లీనమైపోతారు. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.

పరిహారాలుః శీఘ్ర వృత్తి వృద్ది, అభివృద్ది కోసం శ్రీవరలక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి.

 

మకర రాశి: ఈరోజు ఇంట్లో వాతావరణం ఊహకు అందదు !

వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఒకరు ఆశ్చర్యపరచవచ్చు. ఈరాశికి చెందినవారు పొగాకుకు, మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

పరిహారాలుః మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి శ్రీలక్ష్మీ ఆరాధన మంచి శక్తిని ఇస్తుంది.

 

కుంభ రాశి: ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి !

రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్ము ను మదుపు చెయ్యాలి. చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. మీ భార్య గెలుపును మెచ్చుకొండి, విజయాలకు ఆనందించి, ప్రశంసించండి. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి వాదనలు, గొడవలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః వృత్తిలో పురోగతి, జయప్రదం కావటం శ్రీవరలక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. ముత్తైదవులకు సుమంగళీ పదార్థాలను అందించండి.

 

మీన రాశి: ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి !

ప్రతి ఒక్కరు చెప్పినది వినండి, అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. ఈరోజు, కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణస్నేహితుడి సహాయము వలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ప్రయాణం ఖర్చు కానీ, ప్రయోజనకరమే. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు.

పరిహారాలుః ఆర్ధికంగా బలహీనమైన వారికి సహాయం చేయండి. మీకు మంచి జరుగుతుంది.

 

 -శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version