వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా “పవర్ స్టార్” అనే సినిమాను తీసి పెద్ద రచ్చ రచ్చ చేశారు. ఆ వేడి కాస్త తగ్గింది అనుకునేలోపు వర్మ మరో సంచలనానికి తెర తీశారు. ఎవరైనా కల్పిత కథల ఆధారంగా సినిమా తీస్తారు లేదా యదార్థ గాథల ఆధారంగా సినిమా తీస్తారు. కానీ నేను ఇప్పుడో కొత్త కొత్త జోనర్‌లో సినిమా తీయబోతున్నాని ప్రకటించారు. అదే ఫిక్షనల్ రియాలిటీ.. అంటే కల్పిత కథలో రియల్ పీపుల్, రియల్ సిట్యుయేషన్స్ ఆధారంగా పాత్రలను చిత్రీకరించడం అని వివరించాడు ఆర్జీవీ.
FICTIONAL REALITY(FR) is a genre I am inventing for the first time in the world in RgvWorldTheatre..Films can be either fictional or true stories or based upon truth ..FR is about depicting characters based upon REAL PEOPLE and REAL SITUATIONS in a fictional story
— Ram Gopal Varma (@RGVzoomin) July 30, 2020
కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు.
My FR film in RgvWorldTheatre is titled “RGV missing”
STORY iDEA
Rgv’s company office staff are shocked to find Rgv missing and they report to police ..The police initially think it is a publicity stunt by the controversial director till they realise its actually serious— Ram Gopal Varma (@RGVzoomin) July 30, 2020
ఆర్జీవీ మిస్సింగ్ కేసు నిందితులు: 1. పవర్ స్టార్ అభిమానులు 2. ముంబై అండర్ వరల్డ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ 3. ఫ్యాక్షనిస్టుల సహాయంతో ఆర్జీవీని చంపాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి, అతని కొడుకు.
Now the prime suspects in the missing case of Rgv are 3
1.The fans of a very POWERfull STAR
2.A Mega family who have given a contract to the Mumbai underworld https://t.co/KiLKD4yyXt Ex Chief minister and his son who take the help of factionists to go after Rgv— Ram Gopal Varma (@RGVzoomin) July 30, 2020
ఆర్జీవీ మిస్సింగ్ సినిమాలో క్యారెక్టర్ల గురించి పరిచయం చేస్తూ.. ప్రాన్ కళ్యాణ్(Prawan Kalyan), ఒమేగా స్టార్(Omega Star), సి బెన్(CBEN), లాకేష్(LAKESH), వైఎస్ జగన్(WHY S JAGAN), కేసీఆర్(KCAR), కేటీఆర్(KTAR) పేర్లు.. అలాగే వీరితో పాటు పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్ట్‌లు ఉంటారని చెప్పాడు. మరి వర్మ తీయబోతున్న ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.
As the cops start investigating they come across many shocking facts
The film will feature the following characters
Prawan Kalyan
Omega Star
CBEN
LAKESH
WHY S Jagan
KCAR
KTAR
It will also star cops gangsters and factionists..Just u wait for this FR film
— Ram Gopal Varma (@RGVzoomin) July 30, 2020