రామ్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించనున్న హాట్ బ్యూటీ..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఇటీవల ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిరాశ పరచడంతో చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించగా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ .. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడంతో వీరిద్దరి కాంబినేషన్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరిద్దరికి కూడా మాస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నాయి.

అభిమానుల అంచనాలకు ఎక్కడ తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుపుతున్నారట. ఈనెల 26వ తేదీన రామ్, ఊర్వశిల మధ్య ఐటం సాంగ్ చిత్రీకరిస్తారట. ఈ ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసిన మాస్ సాంగ్ కచ్చితంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రామ్ , బోయపాటి కాంబో పై అంచనాలు భారీగానే ఉన్నాయి . ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీ ఊర్వశి కూడా ఐటమ్ సాంగ్ లో చేస్తోందని వార్తలు రానున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే భారి బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news