మునుగోడులో భారీగా పెరిగిన ఇండ్ల అద్దెలు, కిక్కిరిసిన హోటల్లు !

-

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడులు రాజకీయం వేడెక్కింది. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ ఉప ఎన్నికను రాజకీయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సహా.. కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు మునుగోడు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక బైపోల్ కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మునుగోడు లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల నేతలు నియోజకవర్గానికి మఖం మారుస్తున్నారు. ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో, అంతకాలం అక్కడ ఉండటం కోసం మంచి వసతులతో ఉన్న అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. కొందరు బడా నేతలు హోటల్స్ వైపు చూస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని అద్దె ఇల్లు, హోటళ్లకు డిమాండ్ పెరిగింది.

గతంలో హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలోను ఇలాగే జరిగింది. మూడు పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో మఖం వేయడంతో ఇల్లు, హోటళ్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అక్కడ పొలిటికల్ టూరిజం ఊపందుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి మునుగోడులో కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉండే చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇల్లు, లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటివరకు రూ.10,000 పలికిన ఇల్లు షెటర్ అద్దెలు ఇప్పుడు రూ. 15000 దాటాయి. టిఆర్ఎస్ తో పాటు రాజగోపాల్ రెడ్డి ఇల్లు, లాడ్జిలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version