సింహాల నుంచి గున్నలను ఏనుగులు ఎలా కాపాడుతాయంటే?..వీడియో వైరల్!

-

సాధారణంగా వన్యమృగాలు క్రూరమృగమైన సింహాల నుంచి రక్షించుకోవడానికి ఏదో ఒక స్ట్రాటజీని ప్లే చేస్తుంటాయి. అడవిలో సింహం రారాజు.. దాని దాడి నుంచి తప్పించుకోవాలంటే ఏనుగులకు కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. పెద్ద ఏనుగులు అయితే వాటి భారీ కాయం వలన తొండంతో దాడి చేసి ఎలాగోలా తప్పించుకుంటాయి. కానీ, గున్న ఏనుగులు సింహాల దాడి నుంచి తప్పించుకోలేవు.

అందుకే సింహాలు చుట్టుముట్టినప్పుడు ఏనుగుల వ్యూహం ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గజరాజులు గుంపుగా వెళ్తున్నప్పుడు సింహాలు దాడికి ప్రయత్నించిన సందర్భంలో ఏనుగులు తమ పిల్లల్ని మధ్యలో ఉంచి చుట్టూ రక్షణ వలయంలా నిలబడతాయి. అనంతరం సింహం దాడి నుంచి గున్నలకు రక్షణ కల్పిస్తాయి.ఆ సన్నివేశం ఓ కెమెరాలో చిక్కగా, ఆ విజువల్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news