దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? : పవన్ కళ్యాణ్

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతులను ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…’ధాన్యం తడిచిందని మంత్రికి చెబితే చీత్కారంగా మాట్లాడారు. బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్లో ఉన్నారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెడుతున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారు’ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

‘పోలవరం అయ్యిందా అంటే ఓ మంత్రి డాన్సులు చేస్తారు. పునరావాసం అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారు అని మండిపడ్డారు. వైసీపీ పాలన పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తణుకులో అభ్యర్థిని ప్రకటించి వెనక్కి తగ్గాం అని గుర్తు చేశారు.నాగబాబుకు టికెట్ ప్రకటించి కూడా బీజేపీ కోసం తప్పుకున్నాం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version