టీకా తీసుకుంటే.. మూడోవేవ్‌లో కొవిడ్‌ రాదనుకోకండి

-

మనదేశంలో ముఖ్యంగా మూడు కొవిడ్‌ టీకాలు ఆమోదం చెందాయి. కరోనా నేపథ్యంలో ప్రతిరోజూ కొన్ని లక్షలమంది టీకా వేసుకుంటున్నారు. మనదేశంలో ఇప్పటివరకు దాదాపు 21.58 కోట్ల డోసులు వేయించుకున్నారు. అందులో సిరమ్‌ ఇన్సిటిట్యూట్‌కు చెందిన కోవీషిల్డ్, భారత బయోటిక్‌– కోవాగ్జిన్, రష్యా స్పూత్నిక్‌ వీ. ఇవన్ని రెండు డోసులు తీసుకోవాల్నినవి. 12–16 వారాల గ్యాప్‌ మధ్య కోవీషీల్డ్, కోవాగ్జిన్‌కు నాలుగు నుంచి ఆరు వారాలు,12 నుంచి 90 వారాలు స్పూత్నిక్‌ వీ టీకా సమయం తీసుకోవాలి. కానీ, ఈ టీకా మనల్ని ఎంతమేర ర క్షిస్తాయన్నవి చర్చనియంశం.


టీకా తీసుకున్న ఎన్ని రోజులకు ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కేథరిన్‌ ఒబ్రియన్‌ ప్రకారం మొదటి డోసుతోనే ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. కానీ, రెండో డోసు తీసుకున్నాకే పూర్తి స్థాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 

ఎన్నిరోజుల పాటు టీకా పనిచేస్తుంది?

ఇప్పటివరకు రెండు డోసులు తీసుకున్నాక ఎన్ని రోజులు పనిచేస్తున్న ప్రశ్నకు సైంటిస్టుల వద్ద సమాధానం లేదు. టీకా తీసుకున్న కొంతమంది ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తూనే ఉన్నాయని ఒబ్రియన్‌ తెలిపారు. కొద్ది రోజలు గడిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన మరో శాస్త్రవేత్త మాత్రం ఫైజర్‌ టీకా దాదాపు ఆరునెలల పాటు పనిచేస్తుందని చెప్పారు. అదేవిధంగా కొవీషీల్డ్‌ ఏడాదిపాటు పనిచేస్తుందన్నారు.

కొత్త రకం వేరియంట్‌తో ఇమ్యూనిటీ తగ్గుతుందా?

ప్రపంచవ్యాప్తంగా రకరకాల వెరియంట్‌లను గుర్తిస్తున్నారు. భారత్‌లో మొదటిసారి B.1.617.1, B.1.617.2ను గుర్తించారు. అందుకే మూడో డోసును కేవలం బూస్టర్‌ కోసం రెఫర్‌ చేస్తున్నారు సైంటిస్టులు.
ఇప్పటికే ఈ డోసు కోసం కొవాగ్జిన్‌ తన పరిశోధనలను మొదలు పెట్టింది.
ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల రెండు స్టడీస్‌ చేసి, టీకాల తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఏడాదిపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంన్నారు. అంటే పూర్తి వ్యాక్సినేషన్‌ తీసుకున్నాక మూడో డోసు ‘బూస్టర్‌’ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ సోకుతుందా?

ఒక్క విషయం గ్రహించాలి. టీకా పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కరోనా నుంచి ఈజీగా బయటపడవచ్చన్న దానికి కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వైరస్‌ కొత్త రకం మ్యూటెంట్లుగా రూపాంతరం చెందుతుంది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మాట్లాడుతూ వైరస్‌ చాలా తెలివైంది. వాటి మ్యూటెంట్లు శరీరంలో ఉంటాయి. అందుకే టీకా తీసుకుంటే పూర్థి రక్షణ ఉంటుందని సులభంగా చెప్పలేం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version